కరోనాపై పోరు.. హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తున్న కాలేజీలు

ABN , First Publish Date - 2020-04-10T16:37:16+05:30 IST

కోవిడ్-19(కరోనా వైరస్‌) వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోవడానికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.

కరోనాపై పోరు.. హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తున్న కాలేజీలు

హైదరాబాద్: కోవిడ్-19(కరోనా వైరస్‌) వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోవడానికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. సాంప్రదాయ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ కరోనా వైరస్‌పై ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు నగరంలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు తమవంతు బాధ్యతగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన ఓ విద్యాసంస్థ ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి... కరోనా వైరస్ నిరోధంపై సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్) కింద ఈ కార్యక్రమాలను చేపడుతోంది. అన్న వితరణ జరిగే చోట, రద్దీగా ఉంటున్న ప్రాంతాల్లో ప్రజల వద్దకు వెళ్లి అక్కడి వారికి కరోనా వైరస్ నివారణ జాగ్రత్తలు తెలుపుతోంది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజర్ల వినియోగం తదితరాలపై అవగాహన కలిగిస్తోంది.  

Updated Date - 2020-04-10T16:37:16+05:30 IST