తెనాలి డివిజన్‌లో లాక్‌డౌన్ విధింపు
ABN , First Publish Date - 2021-04-11T20:52:28+05:30 IST
తెనాలి డివిజన్‌లో లాక్‌డౌన్ విధింపు
గుంటూరు: జిల్లాలోని తెనాలి డివిజన్‌లో కరోనా విజృంబిస్తోంది. కరోనా వైరస్ ప్రబలడంతో తెనాలి మండలం అంగలకుదురు, పెదరావూరు, కఠెవరం గ్రామాలలో లాక్‌డౌన్ విధించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకే నిత్యవసరాలకు అనుమతి ఇచ్చారు. ఇప్పటికీ భట్టిప్రోలు, కొల్లిపర మండలాల్లో లాక్‌డౌన్ విధించారు. ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.