కరోనా టీకా వేయించుకున్న మంత్రి ఈటల రాజేందర్

ABN , First Publish Date - 2021-03-01T16:41:16+05:30 IST

దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‎ నేటి నుంచి అమలు చేయనున్నారు. 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నేటి నుంచి టీకా ఇవ్వనున్న...

కరోనా టీకా వేయించుకున్న మంత్రి ఈటల రాజేందర్

కరీంనగర్: దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‎ నేటి నుంచి అమలు చేయనున్నారు. 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నేటి నుంచి టీకా ఇవ్వనున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్  హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో కరోనా టీకా వేయించుకున్నారు. అనంతరం మీడియా మీట్ లో ఈటల మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ లేదన్నారు. అందరికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, ఎటువంటి భయం అవసరం లేదని భరోసా ఇచ్చారు. వాక్సిన్ తీసుకోవడం పట్ల ప్రజలు భయాందోళనకు గురికావద్దన్నారు. వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్స్‎లో కూడా అందుబాటులో ఉంటుందని ఈటల తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేష్ రెడ్డి. జిల్లా కలెక్టర్ శశాంక్ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T16:41:16+05:30 IST