నారాయణగూడలోని పరదాగే‌ట్‌లో కరోనా టెన్షన్

ABN , First Publish Date - 2020-04-05T02:57:27+05:30 IST

నగరంలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరదాగేట్‌లో టెన్షన్ నెలకొంది.

నారాయణగూడలోని పరదాగే‌ట్‌లో కరోనా టెన్షన్

హైదరాబాద్ : నగరంలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరదాగేట్‌లో టెన్షన్ నెలకొంది. ఈ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మార్చి-12న ఢిల్లీలో జరిగిన ప్రార్ధనలకు హాజరయ్యారు. అయితే నాలుగు రోజుల క్రితం వారికి పరీక్షల నిమిత్తం అమీర్‌పేట్‌లోని నేచర్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరికి ఇవాళ కరోనా పాజిటివ్ అని తేలింది. మరోవైపు మిగిలిన ఐదుగురికి రిజల్ట్ ఇంకా రాలేదు. పాజిటివ్ వచ్చిన ఇంట్లో 46 మంది కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు.

 

మరోవైపు.. గాంధీ వైద్యుల పర్యవేక్షణలో అతని ఇంట్లోనే మిగిలిన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఆ ప్రాంతంలో ఈ ఆరుగురు ఎవరెవరిని కలిశారు..? పాజిటివ్ అని తేలిన కుటుంబ సభ్యులు ఎవరెవర్ని కలిశారు..? అని స్థానికుల్లో టెన్షన్.. టెన్షన్ నెలకొంది. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-04-05T02:57:27+05:30 IST