పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-30T02:24:36+05:30 IST

కరోనా మహమ్మారి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా విజృంభిస్తోంది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా వరకు ఇప్పటికే కరోనా

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరికి కరోనా పాజిటివ్‌

పెద్దపల్లి: కరోనా మహమ్మారి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా విజృంభిస్తోంది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా వరకు ఇప్పటికే కరోనా బారినపడగా తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి స్వల్ప లక్షణాలు ఉండటంతో శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా సోకింది. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2022-01-30T02:24:36+05:30 IST