46 ఏళ్ల వ్యక్తికి గుండెపోటు.. హైదరాబాద్‌కు తరలించాక మృతి.. కరోనా టెస్ట్ చేస్తే..

ABN , First Publish Date - 2020-06-29T17:01:27+05:30 IST

వరంగల్‌లో కుటుంబంతో సహ నివసిస్తున్న మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తి(46) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందాడు. మెదడులో రక్తం

46 ఏళ్ల వ్యక్తికి గుండెపోటు.. హైదరాబాద్‌కు తరలించాక మృతి.. కరోనా టెస్ట్ చేస్తే..

హైదరాబాద్‌లో మానుకోట జిల్లా వాసి మృతి

మరణానంతరం పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ


మహబూబాబాద్‌ (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో కుటుంబంతో సహ నివసిస్తున్న మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తి(46) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందాడు. మెదడులో రక్తం గడ్డకట్టి స్పృహతప్పి పడిపోయిన ఆయనను శనివారం ఉన్నత వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. శస్త్ర చికిత్స కోసం ముందస్తుగా ఆస్పత్రి వైద్యులు కరోనా పరీక్షలకు నమూనాలను ల్యాబ్‌కు పంపగా రిపోర్టు రాకముందే రెండవసారి గుండెపోటు రావడంతో ఆదివారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో మృత్యువాత పడ్డాడు. ఆపై అందిన పరీక్షల రిపోర్టులో ఆవ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 


మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం వడ్డెరగూడెంకు చెందిన వ్యక్తి కొన్నేండ్ల కిందట వరంగల్‌కు వెళ్లి కుటుంబంతో సహ అక్కడే స్ధిరపడ్డాడు. తొలుత గుండెపోటు రాగానే వరంగల్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రిలో కూడా ప్రాథమిక చికిత్స అందించారని తెలిసింది. ఆపై హైదరాబాద్‌కు తరలించగా చికిత్స అందకముందే మరణించాడు. ఈవిషయాన్ని మహబూబాబాద్‌ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌, కోవిడ్‌ -19 ఇన్‌చార్జి డాక్టర్‌ మల్లం రాజేష్‌ ధ్రువీకరించారు. 

Updated Date - 2020-06-29T17:01:27+05:30 IST