Abn logo
Jul 13 2020 @ 09:17AM

పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 112 కరోనా కేసులు..

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 112 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా మొత్తమ్మద కరోనా కేసుల సంఖ్య 2592కి చేరింది. కొత్తగా ఏలూరులో 56 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కొత్తగా 30 కంటైన్‌మెంట్ జోన్లను అధికారులు ఏర్పాటు చేశారు. నేటి నుంచి 19వ తేదీ వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో  పూర్తి స్థాయిలో లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నారు.


ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం పట్టణాల్లోనూ, ఏలూరు రూరల్, పెదపాడు, పోడూరు, అత్తిలి, మొగల్తూరు పెనుగొండ మండలాల్లోని పలు గ్రామాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు కానుంది. ఉదయం ఆరుగంటల నుంచి 11గంటల వరకే నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరవడానికి అనుమతిస్తున్నారు. మద్యం షాపులు ఉదయం ఆరుగంటల నుంచి 11గంటల వరకు తెరవడానికి అనుమతినిచ్చారు.

Advertisement
Advertisement
Advertisement