కరోనా పాలసీలొచ్చాయ్‌

ABN , First Publish Date - 2020-07-11T06:40:33+05:30 IST

కరోనా ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 29 సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ ఈ మేరకు అనుమతి నిచ్చింది. బీమా సంస్థలు మూడున్నర, ఆరున్నర, తొమ్మిదిన్నర నెలల కాలపరిమితితో

కరోనా పాలసీలొచ్చాయ్‌

  • రూ.5 లక్షల వరకు కవరేజీ
  • మూడు కాల పరిమితుల్లో లభ్యం


న్యూఢిల్లీ: కరోనా ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 29 సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ ఈ మేరకు అనుమతి నిచ్చింది. బీమా సంస్థలు మూడున్నర, ఆరున్నర, తొమ్మిదిన్నర నెలల కాలపరిమితితో శుక్రవారం మూడు ప్రత్యేక కరోనా కవచ్‌ బీమా పాలసీలు ప్రకటించాయి.  కవచ్‌ పాలసీ ప్రత్యేకతలు ప్రకటించాయి.


కరోనా కవచ్‌ పాలసీ ప్రత్యేకతలు

  • సింగిల్‌ ప్రీమియంతో రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కరోనా ఖర్చులకు బీమా కవరేజీ 
  • అదనపు కవరేజీకి రూ.50,000 చొప్పున పెంచుకోవాలి 
  • దేశవ్యాప్తంగా ఒకే ప్రీమియం. జీఎ్‌సటీ అదనం
  • హాస్పిటల్‌ ఖర్చులు, హోమ్‌కేర్‌ ట్రీట్‌మెంట్‌, ఆయుష్‌ వైద్య విధానాల ఖర్చులకూ పాలసీలు వర్తిస్తాయి
  • హాస్పిటల్‌లో చేరాక 15 రోజుల వరకు, డిశ్చార్జ్‌ తర్వాత 30 రోజుల వరకు అయ్యే ఖర్చులకూ వర్తింపు
  • బేస్‌ కవరేజ్‌తో పాటు హాస్పిటల్‌ డెయిలీ క్యాష్‌ కవర్‌ ఎంచుకునే సౌలభ్యం
  •  పాలసీ తీసుకున్న 15 రోజుల తర్వాతే బీమా కవరేజీ
  •  వ్యక్తిగత లేదా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలు ఎంచుకోవచ్చు

బజాజ్‌ అలెయాంజ్

  • వయసు, బీమా మొత్తం, కాలపరిమితిని బట్టి రూ.447 నుంచి రూ.5,630 ప్రీమియం. జీఎ్‌సటీ అదనం.
  • జీఎ్‌సటీ కాకుండా రూ.3 నుంచి రూ.620 ప్రీమియంతో హాస్పిటల్‌లో రోజువారీ నగదు ఎంచుకునే ఆప్షన్‌
  • 0-35 ఏళ్ల వయసు వారికి జీఎ్‌సటీ గాక, రూ.447 ప్రీమియంతో మూడున్నర నెలల కాలానికి రూ.50,000 బీమా

మ్యాక్స్‌ బూపా..

  • 31-55 మధ్య వయసున్న వారికి రూ.2,200 ప్రీమియంతో రూ.2.5 లక్షల కవరేజీ
  • అదే వయసున్న ఇద్దరు పెద్దలు, పిల్లలకు రూ.4,700 ప్రీమియంతో రూ.2.5 లక్షల కవరేజీ

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో 

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో కరోనా అని తేలాక హాస్పిటల్‌లో చేరితే అయ్యే వైద్య ఖర్చులకు కవరేజీ
  • కోవిడ్‌తో పాటు, ఇతర వ్యాధుల చికిత్సకయ్యే ఖర్చులకూ బీమా కవరేజీ
  • రూ2,000 వరకు అంబులెన్స్‌ ఖర్చులకు కవరేజీ
  • వైద్యుల సలహాతో 14 రోజుల వరకు ఇంట్లో ఉండి తీసుకునే ట్రీట్‌మెంట్‌ ఖర్చులకూ బీమా వర్తింపు
  • ఇన్‌పేషెంట్‌గా ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియో వైద్య ఖర్చులకూ పాలసీ వర్తింపు
  • హాస్పిటల్‌లో చేరే ముందు 15 రోజుల వరకు కరోనా నిర్దారణ కోసం డాక్టర్ల కన్సల్టేషన్‌, చెక్‌పలు, వైద్య పరీక్షల కోసం చేసే ఖర్చులకూ పాలసీ వర్తిస్తుంది.

Updated Date - 2020-07-11T06:40:33+05:30 IST