బంగారం ధరలపై కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2022-01-10T21:12:11+05:30 IST

బంగారం, వెండి ధరలపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. గత వారం బంగారం ధరలు భారీగా క్షీణించాయి.

బంగారం ధరలపై కరోనా ప్రభావం

బంగారం, వెండి ధరలపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. గత వారం బంగారం ధరలు భారీగా క్షీణించాయి. గత సోమవారం రూ. 48వేల మార్క్ పైన ప్రారంభమైన బంగారం ధర.. వారం ముగిసే సరికి రూ. 6 వందల వరకు క్షీణించి రూ. 47,500 దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు 18వందల డాలర్ల దిగువకు పతనమయ్యాయి. వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి.


అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు క్షీణించడంతో పసిడి రెండు నెలల కనిష్టానికి చేరింది. ఓవైపు ఒమైక్రాన్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ టెడ్ వడ్డీరేటు పెరుగుతుందనే ఇంట్ నేపథ్యంలో పసిడి ధర క్షీణించింది. కాగా బంగారం ధర 2022 తొలి అర్ధ సంవత్సరంలో భారీగా పడిపోయి.. రెండో అర్థ సంవత్సరంలో రూ. 55వేలకు చేరుకునే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-01-10T21:12:11+05:30 IST