కరోనా ఎఫెక్ట్...
ABN , First Publish Date - 2020-03-26T08:21:41+05:30 IST
లాక్‌డౌన్ నేపథ్యంలో తన కస్టమర్లకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కెనరా బ్యాంక్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇతర బ్యాంకుల
లాక్‌డౌన్ నేపథ్యంలో తన కస్టమర్లకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కెనరా బ్యాంక్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి ఎన్నిసార్లు నగదు తీసుకున్నా సర్వీస్ చార్జీలు ఉండవని తెలిపింది. జూన్ 30 వరకు ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది.
ఇంధనాలకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఇందుకు అనుగుణంగానే రిఫైనరీల ఉత్పత్తిని తగ్గించినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది. ఇంధన ఉత్పత్తిని నాలుగింట ఒక వంతుకు తగ్గించినట్టు పేర్కొంది. ఆటోమొబైల్స్‌కు పెట్రోల్, డీజిల్.. గృహాలకు వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తున్నట్టు తెలిపింది.