తూర్పు గోదావరి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టించింది. పి.గన్నవరం మండలంలోని నరేంద్రపురం గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకింది. మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడికి, పశర్లపూడి బాడవ పాఠశాలలోని ఉపాధ్యాయుడికి కరోనా వచ్చింది. బి.దొడ్డవరం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది.