సీఎం ఇంటి గార్డుకు కరోనా

ABN , First Publish Date - 2020-05-31T08:51:16+05:30 IST

సీఎం జగన్‌ నివాసం వద్ద విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికార వర్గాలతో పాటు ప్రజాప్రతినిధులు సైతం ఉలిక్కిపడ్డారు. కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ సీఎం

సీఎం ఇంటి గార్డుకు కరోనా

గుంటూరు/తాడేపల్లి టౌన్‌, మే 30: సీఎం జగన్‌ నివాసం వద్ద విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికార వర్గాలతో పాటు ప్రజాప్రతినిధులు సైతం ఉలిక్కిపడ్డారు. కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ సీఎం నివాసం వద్ద గార్డు డ్యూటీ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఊరెళ్లి వచ్చిన ఆయన రెండురోజుల క్రితమే విధులకు హాజరయ్యారు. సీఎం నివాసం వద్ద విధులు నిర్వహించే వారందరికీ కరోనా పరీక్షలు చేయగా ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ కానిస్టేబుల్‌తో కలిసి విధులు నిర్వహించే వారందరినీ తప్పించి కొత్త బ్యాచ్‌ని ఎంపిక చేశారు.

Updated Date - 2020-05-31T08:51:16+05:30 IST