కరోనా జన్యుక్రమాన్ని మార్చుకుంటుంది: మోహన్‌రావు

ABN , First Publish Date - 2020-04-03T21:06:19+05:30 IST

కరోనా వైరస్ ఎప్పటికప్పుడు దాని జన్యు క్రమాన్ని మార్చుకుంటుందని

కరోనా జన్యుక్రమాన్ని మార్చుకుంటుంది: మోహన్‌రావు

హైదరాబాద్: కరోనా వైరస్ ఎప్పటికప్పుడు దాని జన్యు క్రమాన్ని మార్చుకుంటుందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్, ప్రముఖ శాస్త్రవేత్త  మోహన్ రావు అన్నారు. ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అందులో భాగంగానే కరోనా వైరస్ మ్యుటేషన్ చెంది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందన్నారు. కావున దీనికి టీకా కానీ మందు కానీ కనుక్కోవడానికి సమయం పడుతుందని చెప్పారు. ఇది మొదట ఊపిరితిత్తులలోకి ప్రవేశించి అక్కడ నుంచి కిడ్నీ, గుండెపై ప్రభావం చూపి.. మనిషి మరణానికి దారితీస్తుందన్నారు.


వైరస్‌కి సాధారణంగా జీవం ఉండదని.. కానీ ఈ వైరస్‌పైన ఉండే ప్రోటీన్ మనిషి కణంపైన ఉండే ప్రోటీన్‌తో బాండింగ్ ఏర్పరచుకుంటుందని మోహన్ రావు అన్నారు. ఫలితంగా విభజన చెంది సంఖ్యను పెంచుకుంటుందని.. మనిషికి ఉండే వ్యాధి నిరోధక శక్తి ఈ వైరస్‌ను కొంత మేరకు మాత్రమే నిలువరించగలదని అన్నారు. కావున ప్రజలందరూ ఇంట్లోనే ఉండి... అత్యవసరంగా బయటకు వచ్చినా సామాజిక దూరం పాటిస్తే వైరస్‌ను నిర్ములించవచ్చునని మోహన్ రావు అన్నారు.


Updated Date - 2020-04-03T21:06:19+05:30 IST