42 కిలో మీటర్లు..749 మంది రన్నర్లు!

ABN , First Publish Date - 2020-04-10T09:37:33+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. దీంతో ఇళ్లల్లో నుంచి కదల్లేని పరిస్థితి....

42 కిలో మీటర్లు..749 మంది రన్నర్లు!

నేడే ‘హోమ్‌ మారథాన్‌’

దుబాయ్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. దీంతో ఇళ్లల్లో నుంచి కదల్లేని పరిస్థితి. కాలు కదపకుండా ఇళ్లల్లోనే ఉండడం ఫిట్‌నెస్‌ ప్రేమికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇందులోంచి పుట్టిందే ‘మారథాన్‌ ఎట్‌ హోమ్‌’. శుక్రవారం నిర్వహించ నున్న ఈ వినూత్న మారథాన్‌లో 62 దేశాలకు చెందిన 749 రన్నర్లు పాల్గొననున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు.. అంటే 10 గంటలపాటు మారథాన్‌ సాగనుంది. ఇందులో భాగంగా రన్నర్లు తమ ఇంట్లోనే 42.196 కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంటుంది. దుబాయ్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌, మిడిల్‌ ఈస్ట్‌ రన్‌ క్లబ్‌ కలిసి ఈ మారథాన్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ మారథాన్‌లో పాల్గొనాలనుకునే వారు నిర్వాహకులు సూచించిన స్ట్రావా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. టాప్‌లో నిలిచిన వారికి బహుమతులు కూడా ఉంటాయి. 

Updated Date - 2020-04-10T09:37:33+05:30 IST