Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కొత్తిమీర వడలు

కొత్తిమీర వడలు

కరకరలాడే స్నాక్స్‌

సాయంత్రం వేళ జిహ్యచాపల్యాన్ని తీర్చే స్నాక్స్‌ తినాలనిపించడం సాధారణమే. అలాంటప్పుడు  పోహా కట్‌లెట్స్‌, మూంగ్‌ దాల్‌ ఛాట్‌, కొత్తిమీర వడలు, రైస్‌ బాల్స్‌ను రుచి చూడండి.  క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఈ స్నాక్స్‌ తయారీ విధానం ఇది...


కావలసినవి: కొత్తిమీర - మూడు కట్టలు, సెనగపిండి - ఒకకప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - ఒకటి, ధనియాల పొడి - అర టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, నువ్వులు - ఒక టీస్పూన్‌, గరంమసాలా - పావు టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, నీళ్లు - పావు కప్పు, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి తరిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అందులో సెనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా, నువ్వులు, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి, అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలపాలి. మెత్తటి మిశ్రమంగా తయారుకావడం కోసం అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు అర చేతుల్లో కొద్దిగా నూనె రాసుకుని ప్లేట్‌లో సమంగా పరిచి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి. చల్లారిన తరువాత స్లైస్‌లుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక వాటిని వేసి వేగించాలి. అంతే... కరకరలాడే కొత్తిమీర వడలు రెడీ.



పనీర్‌ కట్లెట్‌పనీర్‌ కట్లెట్‌క్యాప్సికమ్‌- బ్రొకోలి సబ్జీక్యాప్సికమ్‌- బ్రొకోలి సబ్జీదహీ తడ్కాదహీ తడ్కాబెండకాయ పెరుగు కర్రీబెండకాయ పెరుగు కర్రీఅక్రూత్‌ కీ గలౌటీఅక్రూత్‌ కీ గలౌటీపానకం పానకం వడపప్పువడపప్పుపెసరపప్పు లడ్డుపెసరపప్పు లడ్డుబిస్కెట్లుబిస్కెట్లుకాకరకాయ పొడికాకరకాయ పొడి
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.