14 ఏళ్ల నిరంతర ‘అర్చన’

ABN , First Publish Date - 2022-02-11T05:30:00+05:30 IST

అప్రకటితమైన దేవుడిని నిత్యం తలుస్తూ.. ఆయన గుణగణాలను ప్రతిఫలాపేక్ష లేకుండా అనునిత్యం సంకీర్తన చేయటమే నిజమైన భక్తి. ఆధునిక ప్రపంచంలో ఈ భక్తిని నలుదిశలకు ప్రసారం చేయటం ఒక ముఖ్యమైన కార్యం. దీనిని గత 14 ..

14 ఏళ్ల నిరంతర ‘అర్చన’

అప్రకటితమైన దేవుడిని నిత్యం తలుస్తూ.. ఆయన గుణగణాలను ప్రతిఫలాపేక్ష లేకుండా అనునిత్యం సంకీర్తన చేయటమే నిజమైన భక్తి. ఆధునిక ప్రపంచంలో ఈ భక్తిని నలుదిశలకు ప్రసారం చేయటం ఒక ముఖ్యమైన కార్యం. దీనిని గత 14 సంవత్సరాలుగా విజయవంతంగా భక్తి టీవీ చేస్తోంది. భక్తి టీవీ 15వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా - ప్రచురించిన ప్రత్యేక సావనీర్‌ ‘అర్చన’. అనేక పుస్తకాల నుంచి సేకరించిన.. ప్రముఖుల చేత ప్రత్యేకంగా రాయించిన వ్యాసాల సమాహారమిది. ఆధ్యాత్మికత వ్యాసాలపై ప్రత్యేక ఆసక్తి, అనురక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది. 


అర్చన

సంపాదకుడు: రఘ ఏలూరి

ప్రతులకు: భక్తి టీవీ -  9010354333

Updated Date - 2022-02-11T05:30:00+05:30 IST