చెన్నై: బెంగళూరు నుంచి మీంజూరుకు రెండు కంటైనర్ లారీలలో తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన గుట్కా, పొగాకు వస్తువులను సెంట్రల్ క్రైం విభాగం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఇద్దరిని అరెస్టు చేశారు. మీంజూరు సమీపం గౌండంపాళయం మనలిపుదునగర్ రహదారిలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా రోడ్డుపక్కనే నిలిచివున్న రెండు కంటైనర్ లారీలను తెరచి చూశారు. వాటిలో ఆరుటన్నుల నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను గమనించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నాపాళయంకు చెందిన నాగరాజ్, న్యూ గుమ్మడిపూండికి చెందిన గజేంద్రన్‌ను అరెస్టు చేశారు.