అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోమన్ రెడ్డిపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంటి నొప్పికి తుంటి మీద తన్నినట్టుంది జగన్ పాలన అని వ్యాఖ్యానించారు. 13 జిల్లాలను విడగొట్టి 26 జిల్లాలు చేసి, ఇదే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ అని డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణల మేరకు గ్రామ పంచాయితీలు, తదితర స్థానిక ప్రభుత్వాలకు విధులు, నిధులు, అధికారాలు బదలాయిస్తే అది నిజమైన పాలనావికేంద్రీకరణ అవుతుందని తెలిపారు. గాలేరు నగరి, పోలవరం తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రత్యేక హోదా సాధించి ప్రతి జిల్లాలో పరిశ్రమలు సాధిస్తే అది నిజమైన అభవృద్ధి వికేంద్రీకరణ అవుతుందని అన్నారు. అవి చేయకుండా 13 జిల్లాలైనా, 26 అయినా,175 అయినా ప్రయోజనం లేదని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి