Abn logo
Sep 25 2020 @ 17:58PM

మా సంగారెడ్డి ప్రజలకు ఆ భాగ్యం దక్కింది: బాలు గురించి జగ్గారెడ్డి వ్యాఖ్య

Kaakateeya

హైదరాబాద్: ఎస్పీ బాలసుబ్రమణ్యంతో ఉన్న పరిచయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘శివరాత్రి సందర్భంగా సంగారెడ్డిలో బాలసుబ్రమణ్యంతో కచేరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా బాలసుబ్రమణ్యంతో నాకు ఒక కచేరి చేయించే అవకాశం దొరికింది. మా సంగారెడ్డి ప్రజలు బాలసుబ్రమణ్యాన్ని టీవీలో కాకుండా కార్యక్రమం ద్వారా నేరుగా చూడగలిగారు. సంగీతం అంటే అందరికి ప్రాణమే. అందులో నేను ఒక్కడిని. అందుకే బాలసుబ్రమణ్యాన్ని నేను అభిమానిస్తా. ఘంటాసాల తర్వాత బాల సుబ్రమణ్యమే చరిత్ర బాలసుబ్రమణ్యమని మర్చిపోదు. భూమి మీద మనుషులు ఉన్నంత కాలం ఆయన పాటను మర్చిపోరు. ఈ తరం వాళ్లు ఘంటసాలను చూడలేకపోయినా బాలసుబ్రమణ్యాన్ని చూడగలిగారు’ అని బాలుతో ఉన్న పాత జ్ఞాపకాలను జగ్గారెడ్డి నెమరువేసుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement