గుంటూరులో కాంగ్రెస్‌ నేతల అర్ధనగ్నంగా నిరసన

ABN , First Publish Date - 2022-06-14T00:34:38+05:30 IST

కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌లకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై సోమవారం గుంటూరులో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు.

గుంటూరులో కాంగ్రెస్‌ నేతల అర్ధనగ్నంగా నిరసన

గుంటూరు: కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌లకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై సోమవారం గుంటూరులో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగన్మోహన్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు రాజీవ్‌గాంధీభవన్‌ నుంచి జిన్నాటవర్‌ సెంటర్‌లోని మహాగ్మాగాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబంపై కేసులా.. సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. అనంతరం మస్తాన్‌వలి  మాట్లాడుతూ సెక్షన్‌ 25 కింద నో ప్రాఫిట్‌, నో లాస్‌ విధానంతో నేషనల్‌ హెరాల్డ్‌ అనే పత్రికను  దేశ స్వాతంత్రోద్యమం కోసం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ వివాదంపై 2012లోనే కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి పూర్తి వివరాలతో అందజేస్తే 2016లో క్లోజ్‌ చేసిన కేసును దుర్మార్గమైన ఆలోచనతో ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ కుట్రలను దేశ ప్రజలు సహించరని తెలిపారు.

Updated Date - 2022-06-14T00:34:38+05:30 IST