అర్హులకు బీమా పరిహారం ఇవ్వాలి: Tulasi reddy

ABN , First Publish Date - 2022-06-15T19:34:47+05:30 IST

పంటల భీమా పథకం కింద రాష్ట్రంలోని అనేక మంది రైతులకు పరిహారం అందకపోవడం దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి(Tulasireddy) అన్నారు.

అర్హులకు బీమా పరిహారం ఇవ్వాలి: Tulasi reddy

అమరావతి: పంటల భీమా పథకం కింద రాష్ట్రంలోని అనేక మంది రైతులకు పరిహారం అందకపోవడం దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి(Tulasireddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ...  29 లక్షల మంది రైతులు అర్హులు కాగా.. 15.6 లక్షల మందికి మాత్రమే మంజూరు అయ్యిందన్నారు. లక్ష మంది రైతుల ఖాతాల్లో డబ్బు పడలేదని తెలిపారు. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో రైతులు ధర్నాలు చేశారని,  గ్రామ సచివాలయాలకు తాళాలు వేశారని అన్నారు. పులివెందుల పరిధిలో మామిడికి నష్టం.. పరిహారం అందలేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో మిర్చికి నష్టం.. పరిహారం అందలేదన్నారు. ప్రభుత్వం పునరాలోచించి అర్హులకు బీమా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోనసీమ, కె.సి.కెనాల్ రైతులు విరామం ప్రకటిస్తే సీఎం జగన్ ప్రతిపక్షాలపై నింద వేస్తున్నారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-06-15T19:34:47+05:30 IST