రాజమండ్రి: రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) పర్యటనను వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో కాంగ్రెస్ (Congress) నిరసనకు దిగింది. పీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్ (Sailajanath) ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మోదీ గోబ్యాక్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా... జాంపేట గాంధీ బొమ్మసెంటర్ వద్ద కాంగ్రెస్ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. శైలజానాధ్ సహా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏపి విభజన హామీలు తక్షణమే అమలు చేయాలని... ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.
ఇవి కూడా చదవండి