Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 29 2021 @ 18:17PM

ప్రజలే గుణపాఠం చెబుతారు: పొన్నాల

హైదరాబాద్: మదమెక్కిన పీఎం మోదీ, సీఎం కేసీఆర్‌లకు ప్రజలే గుణపాఠం చెబుతారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. చర్చలు, మేధావుల సలహాలు తీసుకోకుండా నూతన వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్‌ను మోదీ తెచ్చారని ఆయన ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని రాహుల్ ముందే చెప్పారని ఆయన పేర్కొన్నారు. సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడం రైతులు, కాంగ్రెస్ విజయమన్నారు. గోదాముల్లో బియ్యం నిల్వలు ఉంటే కేంద్ర వ్యవసాయ మంత్రి ఏంచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విదేశాలకు ఎగుమతులను పెంచాల్సిన బాధ్యత కేంద్రానిది కాదా అని పొన్నాల నిలదీశారు. 


Advertisement
Advertisement