హైదరాబాద్: ధరణి అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని 30 శాతం భూములను నిషేధిత చట్టాల్లో పెట్టారని కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి ఆరోపించారు. ధరణి వచ్చిన తర్వాత లక్షలమంది భూములు ధరణిలోకి ఎక్కలేదని ఆయన విమర్శించారు. ధరణి అమలులోకి వచ్చిన తరువాత తరతరాలుగా వచ్చిన భూములను కూడా నిషేధిత చట్టాల్లో పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత భూముల వివరాలను గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో పెట్టాలని ప్రభుత్వాన్ని కోదండరెడ్డి డిమాండ్ చేశారు.