Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెనాలిలో కాంగ్రెస్ జన జాగరణ యాత్ర

గుంటూరు: జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో జన జాగరణ యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో భాగంగా కొల్లిపర అడ్డరోడ్డు వద్ద నీటి మునిగిన పంట పొలాలను నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుందన్నారు. సీఎం, మంత్రులు ఏసీ గదులలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకు కనీసం బాధితులతో మాట్లాడే సమయం కూడా లేదన్నారు. 


ఆకాశంలో విహరిస్తే బాధితుల కష్టాలు తీరవన్నారు. మంత్రులు, అధికారులు కూడా రైతుల వద్దకు రావడం లేదన్నారు. అధికారులు తక్షణమే పంట నష్టం అంచనాలను తయారు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ యాత్రలో జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వర రావు, తెనాలి ఇన్‌చార్జ్ చందు సాంబశివుడు, నాయకులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement