Abn logo
Oct 18 2020 @ 03:36AM

మీటర్ల బిగింపును అడ్డుకుంటాం: శైలజానాథ్‌

డోన్‌, అక్టోబరు 17: ‘‘రైతులకు అన్యాయం చేయాలన్న అజెండాతోనే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. కేంద్రం ఇచ్చే రుణాలకు ఆశపడి సీఎం జగన్‌ రాష్ట్ర రైతాంగానికి ద్రోహం చేస్తున్నారు. అందుకే వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ మీటర్లను బిగించాలని చూస్తున్నారు. దీన్ని అడ్డుకుని తీరుతాం’’ అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. శనివారం కర్నూలు జిల్లా డోన్‌ మండలం మల్లెంపల్లి గ్రామంలో వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు.   

Advertisement
Advertisement
Advertisement