ప్రపంచమంతా కండోమ్‌ల కొరత

ABN , First Publish Date - 2020-03-29T09:29:30+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా కండోమ్‌ల తయారీకి బ్రేక్‌ పడింది. మలేషియాకు చెందిన కారెక్స్‌ బీహెచ్‌డీ అనే సంస్థ వీటి తయారీకి ప్రసిద్ధి. ప్రపంచవ్యాప్తంగా వినియోగమవుతున్న ప్రతీ ఐదు కండోమ్‌ల్లో ఒకటి ఈ సంస్థ నుంచి వచ్చినదే.

ప్రపంచమంతా కండోమ్‌ల కొరత

  • తయారీని నిలిపేసిన మలేసియా సంస్థ

కౌలాలంపూర్‌, మార్చి 28: కరోనా వైరస్‌ కారణంగా కండోమ్‌ల తయారీకి బ్రేక్‌ పడింది. మలేషియాకు చెందిన కారెక్స్‌ బీహెచ్‌డీ అనే సంస్థ వీటి తయారీకి ప్రసిద్ధి. ప్రపంచవ్యాప్తంగా వినియోగమవుతున్న ప్రతీ ఐదు కండోమ్‌ల్లో ఒకటి ఈ సంస్థ నుంచి వచ్చినదే. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు వారాలుగా ఈ సంస్థ మలేషియాలోని మూడు ప్రధాన ఫ్యాక్టరీల్లో ఒక్కటి కూడా తయారుచేయలేదు. ఫలితంగా దాదాపు కోటి కండోమ్‌ల తయారీ, సరఫరా ఆగిపోయింది. డ్యూరెక్స్‌ లాంటి ప్రపంచస్థాయి సంస్థల ద్వారా ఈ కండోమ్‌లు వివిధ దేశాలకు రవాణా అవుతాయి. బ్రిటన్‌లోని జాతీయ ఆరోగ్య సేవల కేంద్రం, ఐక్యరాజ్యసమితి జనాభా నిధి వీటిని కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంటాయి. వీటిని తిరిగి తయారు చేయడానికి అనుమతినిచ్చినా ఎక్కువమంది సిబ్బంది స్వీయ నిర్బంధంలో ఉండడం వల్ల తయారీ సగం కూడా అయ్యే అవకాశాల్లేవు. ఈ కొరత కొన్ని నెలలు ఉం టుందని అంటున్నారు తగిన సంఖ్యలో ఇవి సరఫరా కాకపోతే ప్రపంచ దేశాల్లో- ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలుత్పన్నం కాగలవని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2020-03-29T09:29:30+05:30 IST