Abn logo
May 15 2021 @ 00:26AM

‘కుంచె’ నివాళి

‘ఇన్నాళ్ళూ ఏ చేతివేళ్లు

నన్ను ఒయ్యారంగా

మలుపులు తిరిగే

ఓ చైతన్య వస్తువుగా

కేన్వాసుపై నాట్యం చేయించాయో,

ఆ చేతి వేళ్లలోంచి

జారిపడిన నేను

అచేతనంగా నేలకొరిగిన

ఆ ‘చంద్ర’కే నివాళిగా

ఇన్ని కన్నీటి బొట్లు రాల్చాను’


– శ్రీ సింధు

Advertisement