Abn logo
Nov 25 2021 @ 16:10PM

ఠాకూర్ రాజ్‌సింగ్‌‌పై HRCలో ఫిర్యాదు

హైదరాబాద్: ఠాకూర్ రాజ్‌కుమార్ సింగ్‌తో తమకు ప్రాణహాని వుందని గిరిజన మహిళలు మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఠాకూర్‌పై హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల కమిషన్ తనకు క్లిన్ చీట్ ఇచ్చిందని హెచ్చార్సీని ఠాకూర్ తప్పుదోవబట్టించాడు.  ఐలాపూర్ తాండలో గిరిజనుల భూములను ప్రభుత్వ భూములంటూ లేఖలు రాస్తూ బెదిరిస్తున్నాడని కమిషన్‌కు గిరిజనులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్‌ను గిరిజన మహిళలు ఆశ్రయించారు.