పోటీతత్వం పెరగాలి..

ABN , First Publish Date - 2020-11-01T08:43:57+05:30 IST

బాధ్యతయుతమైన పోటీతత్వం కంపెనీల్లో పెరగాలి. ఇది తక్షణ అవసరం. సమాజానికి మరింత విలువను జోడించాలి. సమగ్ర వృద్ధికి దోహదం చేయాలని ఐటీసీ చైర్మన్‌, ఎండీ సంజీవ్‌ పురి అన్నారు...

పోటీతత్వం పెరగాలి..

  • ఐటీసీ ఎండీ సంజీవ్‌ పురి 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బాధ్యతయుతమైన పోటీతత్వం కంపెనీల్లో పెరగాలి. ఇది తక్షణ అవసరం. సమాజానికి మరింత విలువను జోడించాలి. సమగ్ర వృద్ధికి దోహదం చేయాలని ఐటీసీ చైర్మన్‌, ఎండీ సంజీవ్‌ పురి అన్నారు. నీటి కొరత, పర్యావరణ సమస్యల పరిష్కారంలో కంపెనీలు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని.. ఈ సమస్యలపై వెంటనే స్పందించాలి సూచించారు. భారత్‌ను మేధో సంపత్తి హక్కుల కేంద్రంగా తీర్చిదిద్దాలని.. కంపెనీలు భారత్‌లోనే వస్తువులకు విలువ సృష్టించాలి. ఆ విలువను కాపాడుకోవాలని పేర్కొన్నారు.  ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) పీజీపీఎంఏఎక్స్‌ లీడర్‌షిప్‌ సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు మంచి అవకాశాలను, ప్రతిఫలాలను అందించగలవన్నారు. కంపెనీలు సిబ్బందిలో కొత్త ఉత్సాహాలను నింపాలని సూచించారు. సామాజిక ప్రయోజనాలకు కంపెనీలు పని చేయాలని.. తమ వంతు సహాయ సహకారాలను అందించాలని పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-01T08:43:57+05:30 IST