తిరుమల, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): నివర్ తుఫాను సమయంలో కోసిన పంటకే నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టడం సబబు కాదని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. పంట చేతికొచ్చిన సమయంలో రైతు వెన్ను విరిచేలా వరదలు వచ్చాయన్నారు. పంటపై పెట్టుబడి పెట్టిన రైతులందరినీ ఆదుకోవాలన్నారు.