సుశీలకు సిల్వర్‌

ABN , First Publish Date - 2022-08-02T09:16:13+05:30 IST

కామన్వెల్త్‌ గేమ్స్‌లో మరో మణిపురీ యువతి మెరిసింది. జూడో 48 కిలోలలో 27 ఏళ సుశీలాదేవి రజత పతకం సాధించింది.

సుశీలకు సిల్వర్‌

విజయ్‌కు కాంస్యం 

జూడోలో రెండు పతకాలు


కామన్వెల్త్‌ క్రీడల నాలుగోరోజు భారత్‌ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఈ రజత, కాంస్యాలు జూడోలో లభించాయి..లాన్‌బౌల్స్‌ మహిళల ఫోర్స్‌లో భారత జట్టు చారిత్రక ఫైనల్‌కు చేరింది..తద్వారా మనకు ఓ పతకం ఖాయం చేసింది..బాక్సింగ్‌లో తెలుగు కుర్రాడు మహ్మద్‌ హుసాముద్దీన్‌ తన కేటగిరీలో క్వార్టర్‌ఫైనల్‌కు చేరి పతకం దిశగా సాగుతున్నాడు..సీనియర్‌ బాక్సర్‌ అమిత్‌ పంగల్‌ కూడా పతకానికి ఒక్క బౌట్‌ దూరంలో నిలిచాడు..బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీం ఈవెంట్‌లో భారత్‌ ఫైనల్లో అడుగుపెట్టింది..


బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో మరో మణిపురీ యువతి మెరిసింది. జూడో 48 కిలోలలో 27 ఏళ సుశీలాదేవి రజత పతకం సాధించింది. సోమవారం జరిగిన ఫైనల్లో సుశీల.. సౌతాఫ్రికాకు చెందిన మిహాయిల్‌ విట్బూయీ చేతిలో పరాజయం చవిచూసింది. ఇద్దరు జుడొకాలు పోటాపోటీగా తలపడడంతో నిర్ణీత మూడు నిమిషాల్లో ఎవరూ పూర్తి పా యింట్‌ (నిప్పన్‌) సాధించలేకపోయారు. దాంతో గోల్డెన్‌ స్కోరుకోసం అదనంగా సమయం కేటాయించారు. అందులో సుశీలను పడదోసిన మిహాయిల్‌ పసిడి పతక విజేతగా నిలిచింది. అమీ ప్లాటన్‌ (ఇంగ్లండ్‌), ఎస్పోసిటో (మాల్టా) కాంస్య పతకాలు దక్కించుకున్నారు. కాగా..కామన్వెల్త్‌లో సుశీలకు ఇది రెండో రజత పతకం కావడం విశేషం. 2014 గ్లాస్గోలోనూ ఆమె రన్నర్‌పగా నిలిచింది.


ఇక పురుషుల 60కి. కాంస్య పతక పోరులో విజయ్‌కుమార్‌ యాద వ్‌ ఏకంగా 10-0తో  పెట్రోస్‌ (సైప్ర్‌స)ను చిత్తు చేసి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. జూడో పురుషుల 66 కి. కాంస్య పతక పోరులో జస్లీస్‌ సింగ్‌ సైనీ ఆస్ట్రేలియాకు చెందిన నాథన్‌ కట్జ్‌ చేతిలో ఓడాడు. మహిళల 57కి.లలో సుచికా తరియాల్‌ మారిషస్‌ ప్రత్యర్థి లెజెంటిల్‌ చేతిలో పరాజయం పాలైంది. 


హాకీ..ఇంగ్లండ్‌తో డ్రా:

పురుషుల హాకీలో భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌ 4-4తో డ్రా అయింది. హాఫ్‌ టైమ్‌కు 3-0తో భారత్‌ తిరుగులేని ఆధిక్యంలో ఉండగా..చివరి రెండు క్వార్టర్స్‌లో అనూహ్యంగా పుంజుకున్న ఇంగ్లండ్‌ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 


లాన్‌బౌల్‌..:

లాన్‌బౌల్‌ మహిళల ఫోర్స్‌ ఈవెంట్‌లో భారత జట్టు ఫైనల్లో ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో చారిత్రక పతక రేసులో భారత్‌ నిలిచింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో లవ్లీ చౌబే (లీడ్‌) ఆధ్వర్యంలో, పింకీ (సెకండ్‌), నయన్‌మోనీ సైకియా (థర్డ్‌), రూపారాణీ టిర్కే (స్కిప్‌)తో కూడిన భారత జట్టు 16-13తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. స్వర్ణ పతక పోరులో సౌతాఫ్రికాను మన మహిళలు ఢీకొంటారు. 


సెమీస్‌లో సౌరవ్‌..: 

పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సౌరవ్‌ ఘోశాల్‌ 11-5, 8-11, 11-7, 11-3తో గ్రెగ్‌ లోబన్‌ (స్కాట్లాండ్‌)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో జోష్న చిన్నప్ప ..హోలీ నాటన్‌ (కెనడా) చేతిలో ఓడింది. జిమ్నాస్టిక్స్‌ వాల్ట్‌ ఫైనల్లో ప్రణతీ నాయక్‌ (12.669పా.) ఐదో స్థానంలో నిలిచింది. బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీం విభాగంలో సింగపూర్‌ను 3-0తో ఓడించిన భారత్‌ ఫైనల్లో ప్రవేశించింది. 


స్విమ్మింగ్‌..ఫైనల్లో నటరాజ్‌:

ఏస్‌ స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ పురుషుల 50మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్లో ప్రవేశించాడు. 21 ఏళ్ల నటరాజ్‌ సెమీస్‌లో 25.38సె. గమ్యం చేరాడు. కాగా 100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్లో నటరాజ్‌ ఏడో స్థానం సాధించాడు. సాజన్‌ ప్రకాశ్‌ పయనం అత్యంత నిరాశాజనకంగా ముగిసింది. సోమవారం 100మీ. బటర్‌ఫ్లైలో 54.36సె. గమ్యం చేరిన సాజన్‌ తన హీట్‌లో ఏడో, ఓవరాల్‌గా 19వ స్థానంలో నిలిచాడు. దాంతో అతడు సెమీ్‌సకు అర్హత సాధించలేకపోయాడు. 200మీ. బటర్‌ఫ్లైలోనూ సాజన్‌ ఫైనల్‌కు చేరలేకపోయాడు. 

Updated Date - 2022-08-02T09:16:13+05:30 IST