బియ్యం సేకరణ, ధర నిర్ణయానికి కమిటీ

ABN , First Publish Date - 2021-07-25T07:41:23+05:30 IST

రాష్ట్రంలోని ఆహార భద్రత కార్డుదారుల కోసం 6లక్షల టన్నుల బియ్యం సేకరణకు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం, సంక్షేమ పథకాలకు అవసరమయ్యే సన్న బియ్యం సేకరణకు ధర...

బియ్యం సేకరణ, ధర నిర్ణయానికి కమిటీ

  • పౌర సరఫరాల కమిషనర్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆహార భద్రత కార్డుదారుల కోసం 6లక్షల టన్నుల బియ్యం సేకరణకు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం, సంక్షేమ పథకాలకు అవసరమయ్యే సన్న బియ్యం సేకరణకు ధర నిర్ణయానికి ప్రభుత్వం కమిటీ వేసింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి. అనిల్‌కుమార్‌ ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వ్యవహరిస్తారు. ఇందులో పౌరసరఫరాల సంస్థ ఎండీ, వ్యవసాయశాఖ కమిషనర్‌ సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో 87,56,112 ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన 53,29,382 కార్డుదారులకు కేంద్రమే బియ్యం పంపిణీ చేస్తుంది. 


Updated Date - 2021-07-25T07:41:23+05:30 IST