మంత్రులకు సాగిలపడుతున్న టీటీడీ అధికారులు.. వెల్లువెత్తుతున్న విమర్శలు
ABN , First Publish Date - 2021-08-20T14:50:28+05:30 IST
మంత్రులకు టీటీడీ సాగిలపడి సేవలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో 5నెలలుగా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ దూరం చేసిన విషయం తెలిసిందే.
తిరుమల : మంత్రులకు టీటీడీ సాగిలపడి సేవలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో 5నెలలుగా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ దూరం చేసిన విషయం తెలిసిందే. మంత్రులకు మాత్రం ఇష్టారీతినా టిక్కెట్లను జారీ చేస్తోంది. మంత్రులు, వారి అనుచరులకు మాత్రం ప్రోటోకాల్ మర్యాదలతో దర్శనాలు ఏర్పాటు చేస్తోంది. ఇవాళ 67 మంది అనుచరులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రోటోకాల్ దర్శనం చేసుకున్నారు. అనుచరులతో కలిసి దర్శనం చేసుకోవడంలో తప్పు ఏముందని ఆయన ప్రశ్నించడం గమనార్హం. సర్వదర్శనం భక్తులను దర్శనానికి కోవిడ్ నిభందనలు మేరకు ఇప్పట్లో అనుమతించబోమన్న వెల్లంపల్లి ఆయన మాత్రం పదుల సంఖ్యలో అనుచరులతో దర్శనం చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. శ్రీవారి ఆలయం మంత్రులకు అడ్డాగా మారిపోతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.