మణుగూరు హెవీవాటర్ ప్లాంట్లో ఓ-18 ఉత్పత్తి ప్రారంభం
ABN , First Publish Date - 2022-01-19T09:34:10+05:30 IST
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్లాంట్ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మణుగూరు భార జల కర్మాగారం మరో మైలురాయిని అధిగమించింది.
దేశంలో తొలిసారి.. 26న జాతికి అంకితం చేయనున్న ప్రధాని
అశ్వాపురం, జనవరి 18: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్లాంట్ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మణుగూరు భార జల కర్మాగారం మరో మైలురాయిని అధిగమించింది. జీవరసాయన చర్యల్లో వినియోగించే హెచ్-2 ఓ-18 ఉత్పత్తి మంగళవారం మణుగూరు హెవీవాటర్ ప్లాంట్లో ప్రారంభమైంది. దేశంలోనే ఓ-18 ఉత్పత్తి ఈ ప్లాంట్లోనే జరగడం గమనార్హం. ఈ ప్లాంట్ను సోమవారం భారత అణుశక్తి విభాగం చైర్మన్ కె.ఎన్.వ్యాస్ వర్చువల్గా ప్రారంభించారు. కాగా 26న జరగనున్న రిపబ్లిక్ డే ఉత్సవా ల్లో ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ఈ ప్లాంట్ను జాతికి అంకితం ఇవ్వనున్న ట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఓ-18 ఐసోటోప్ ద్వారా మానవ శరీరంలోని ట్యూమర్లు, కేన్సర్ ప్రేరేపిత కారకాలు, డిమెన్షియావంటి వ్యాధుల మూలాలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఉపయోగించనున్నారు. ఇప్పటివరకు అమెరికా, చైనా వంటి దేశాలు మాత్రమే ఓ-18ని ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం.