Advertisement
Advertisement
Abn logo
Advertisement

జవాద్ తుపానుపై కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌

విజయనగరం: జవాద్ తుపానుపై స్పెషల్‌ ఆఫీసర్‌ కాంతిలాల్‌, కలెక్టర్‌ సూర్యకుమారి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులు, సిబ్బంది క్షేత్ర స్ధాయిలో ఉండాలని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రహదారులు, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్ధలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు 4 రోజులకు సరిపడ సరుకులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ధాన్యాన్ని ప్రభుత్వ గోదాములు, రైతు భరోసా కేంద్రాల్లో భద్రపర్చుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ గడప దాటకూడదని సూర్యకుమారి సూచించారు.


ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గంటకు 30కిలోమీటర్ల వేగంతో తీవ్రవాయుగుండం కదులుతోంది. విశాఖపట్నానికి 480 కిలోమీటర్లు, గోపాలపూర్‌కు 600 కిలోమీటర్లు, పారదీప్‌కు 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 6 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలకు  వాయుగుండం  చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్రలో  పలుచోట్ల  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,  అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి.

Advertisement
Advertisement