రాజుపేట ఏజెన్సీ భూములు కొనొద్దు: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-03-05T05:17:29+05:30 IST

రాజుపేట ఏజెన్సీ భూములు కొనొద్దు: కలెక్టర్‌

రాజుపేట ఏజెన్సీ భూములు కొనొద్దు: కలెక్టర్‌
నర్సంపేటలో కూరగాయల మార్కెట్‌ భవన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత

నర్సంపేట, మార్చి 4 : రాజుపేట పం చాయతీ పరిధిలోని భూములను కొనుగో లు చేసి ప్రజలు మోసపోవద్దని కలెక్టర్‌ హరిత  సూచించారు. పట్టణంలోని కూర గాయల మార్కెట్‌ భవన నిర్మాణ పనుల ను ఆమె పరిశీలించారు. అనంతరం దామె ర చెరువు సమీపంలోని డబుల్‌ బెడ్‌రూ మ్‌, ప్రభుత్వాస్పత్రి భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలం చుట్టూ ట్రంచ్‌ పనుల నుకలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం రాజు పేట పరిధిలోని భూములను, అక్రమంగా ఏర్పాటు చేసిన స్థలాలను పరిశీలించారు. ఎజన్సీ పరిధిలోని భూములను గిరిజనేతరులు కొనుగోలుచేసి అమ్మకాలు జరపడం చట్ట విరుద్ధమన్నారు. ఈ భూములను కొనుగోలు చేసి ఎవరూ మోసపోవద్దని, ఈ గ్రామ పరిధిలో పాట్లు చేసిన వారికి నోటీసులు జారీచేసి భూములను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధి కారులను కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే గ్రామపరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చి వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై చర్చించడానికి కలెక్టరే ట్‌కు రావాలని ఎంపీడీవో, ఎంపీఈవోలను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి, ఆర్డీవో పవన్‌కుమార్‌, టీపీవో వీరస్వామి, తహసీల్దార్‌ వాసం రాంమూర్తి, ఆర్‌ఐ రాజు, కమిషనర్‌ విద్యాధర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-05T05:17:29+05:30 IST