సీజన్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-07-04T11:33:59+05:30 IST

సీజన్‌ వ్యాధులతో ప్రతీ ఒకరు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్‌ హరిత సూచించారు

సీజన్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

పరకాల, జూలై 3 : సీజన్‌ వ్యాధులతో ప్రతీ ఒకరు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్‌ హరిత సూచించారు. శుక్రవారం పరకాల గణపతి కళాశాలలో సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శలకు రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో డంపింగ్‌ యార్డులను పూర్తి చేయాలని, ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. ప్రతీ గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో సంపత్‌రావు, జడ్పీటీసీ రాజారావు, డీపీవో నారాయణరావు పాల్గొన్నారు.


ఆలియాబాద్‌లో..

పరకాలరూరల్‌:  ప్రకృతి వనాలను అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. పరకాల మండలం ఆలియాబాద్‌లో శుక్రవారం  కలెక్టర్‌ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమాదేవి, ఎంపీటీసీ కోరె రమేష్‌, తహసీల్దార్‌ జగదీశ్వర్‌, ఎంపీడీవో బాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-04T11:33:59+05:30 IST