కొబ్బరిపాల రసం

ABN , First Publish Date - 2020-02-29T17:07:42+05:30 IST

ఇంగువ-చిటికెడు, కొత్తిమీర- రెండు టేబుల్‌స్పూన్లు, చిక్కటి కొబ్బరిపాలు-ఒక కప్పు, ఆవాలు- అర టీస్పూన్‌, చింతపండు-ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు-ఒక టీస్పూన్‌, పసుపు-పావు

కొబ్బరిపాల రసం

కావలసినవి: ఇంగువ-చిటికెడు, కొత్తిమీర- రెండు టేబుల్‌స్పూన్లు,  చిక్కటి కొబ్బరిపాలు-ఒక కప్పు, ఆవాలు- అర టీస్పూన్‌,  చింతపండు-ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు-ఒక టీస్పూన్‌, పసుపు-పావు టీస్పూన్‌, కొబ్బరినూనె- రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి -ఒకటి (అందులోని గింజలు తీసి చిన్న ముక్కలుగా), కరివేపాకులు-ఏడు, వేడినీళ్లు- అర కప్పు, చల్లటి నీళ్లు-ఒకటిన్నర కప్పు,  రసంపొడి- రెండు టేబుల్‌స్పూన్లు.


తయారీ: అరకప్పు వేడి నీళ్లల్లో చింతపండును అరగంటపాటు నానబెట్టి దాన్నించి చిక్కటి రసం తీయాలి.

బాండీ తీసుకుని అందులో చింతపండు రసం పోసి అందులో ఒకటిన్నర కప్పుల  నీళ్లు కలపాలి.

అందులో పావు టీస్పూను పసుపుతో పాటు రెండు టేబుల్‌స్పూన్ల రసం పొడి వేసి గరిటతో బాగా కలపాలి.

కడాయిలోని రసం మరిగే దాకా  సన్నని మంటపై దాన్ని అలాగే ఉంచాలి. 

రసం మరగడం మొదలైన తర్వాత మరో రెండు మూడు నిమిషాలు అదనంగా మంటపై ఉంచాలి. 

తర్వాత మంట ఆపేసి అందులో ఒక కప్పు చిక్కటి కొబ్బరిపాలు పోసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. తర్వాత దాన్ని ఒకసారి  కలిపి మూతపెట్టి పక్కన పెట్టాలి.

తర్వాత చిన్న కడాయిలో రెండు టేబుల్‌స్పూన్ల కొబ్బరి నూనె (లేదా నెయ్యి కూడా వాడొచ్చు) వేసి వేడెక్కాక కాస్త మంట తగ్గించి రసంలో ఆవాలు వేయాలి. అవి చిటపటలాడుతుంటే అందులో రెడీగా పెట్టుకున్న ఎండు మిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకులు అందులో వేయాలి. తాలింపు బాగా వేగాక దాన్ని కొబ్బరిపాల రసంలో వేయాలి. దానిపై కొత్తిమీరాకును చల్లాలి. వేడి అన్నంలో ఈ కొబ్బరిపాల రసం ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2020-02-29T17:07:42+05:30 IST