Advertisement
Advertisement
Abn logo
Advertisement

గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని,ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పరామర్శించారు. ఎమ్మెల్యే తండ్రి వెంకట్రామ్ రెడ్డి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి గద్వాల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంక్రటామ్ రెడ్డి చిత్రపటానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, విఎం అబ్రహం, మర్రి జనార్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జైపాల్ యాదవ్,పట్నం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement