వీనికి ఫోన్ చేసి చెప్పిందా.. కరోనా థర్డ్ వేవ్‌పై కేసీఆర్

ABN , First Publish Date - 2021-06-21T22:42:09+05:30 IST

కరోనా సెకండ్ వేవ్‌తో జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఆస్పత్రుల్లో లక్షల బిల్లులతో జనం బెంబేలెత్తిపోయారు. వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో

వీనికి ఫోన్ చేసి చెప్పిందా.. కరోనా థర్డ్ వేవ్‌పై కేసీఆర్

వరంగల్: కరోనా సెకండ్ వేవ్‌తో జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఆస్పత్రుల్లో లక్షల బిల్లులతో జనం బెంబేలెత్తిపోయారు. వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో కాస్త అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందని సాక్షాత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నారు. అయితే థర్డ్ వేవ్‌పై వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇబ్బందికరమన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్‌పై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 


‘‘స్కూళ్లు లేక ఇళ్లన్నీ అంగడంగడి చేస్తున్నారు పిల్లలు. వాళ్లకు కరోనా వస్తుందన్న పుకార్లు పుట్టాయి. వీనికి ఫోన్ చేసి చెప్పిందా. ఈ తాప అచ్చి పిల్లలకు పడతాననని.. ఎట్ల పుట్టించినరంటే... ఇప్పటికే పుస్తలతాళ్లు అమ్ముకుని లక్షలు కుమ్మరించారు జనం. దండం పెట్టి చెబుతున్నా... పుకార్లు మానండి. మాస్కు పెట్టుకోమని చెప్పండి. అంతేకాని భయపెట్టకండి’’ అన్నారు. 

Updated Date - 2021-06-21T22:42:09+05:30 IST