సీఎం కేసీఆర్ సెక్యులరిస్టు: హోం మంత్రి మహమూద్ అలీ

ABN , First Publish Date - 2022-03-23T00:26:46+05:30 IST

సీఎం కేసీఆర్ సెక్యులరిస్టు అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్

సీఎం కేసీఆర్ సెక్యులరిస్టు: హోం మంత్రి మహమూద్ అలీ

వరంగల్‌: సీఎం కేసీఆర్ సెక్యులరిస్టు అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. జిల్లాలోని టీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ సెల్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో కేసీఆర్ లాంటి నాయకుడే లేడన్నారు. ముస్లిం మైనారిటీల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రం రాకముందు ఎన్నో మత ఘర్షణలు జరిగాయని, కానీ  రాష్ట్రం వచ్చిన ఏడున్నరేండ్లలో ఎక్కడా ఘర్షణలు జరగలేదన్నారు. కాంగ్రెస్ 65 ఏళ్ల పాలనలో విద్యకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత 240 మైనారిటీ స్కూల్స్ తెచ్చి, ఒక్కో విద్యా ర్తి పై  1.20 లక్షలు ఖర్చు పెడుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తొందర్లోనే 80 వేలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తున్నారన్నారు. ఈ ఎగ్జామ్స్‌ను అన్ని భాషలతో పాటు ఉర్దూలో కూడా ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నరేందర్, వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్, ముస్లిం కమ్యూనిటీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-23T00:26:46+05:30 IST