సీఎం కేసీఆర్ పై రాణిరుద్రమ దేవి విమర్శలు

ABN , First Publish Date - 2020-08-13T22:03:44+05:30 IST

సీఎం కేసీఆర్ పై రాణిరుద్రమ దేవి విమర్శలు

సీఎం కేసీఆర్ పై రాణిరుద్రమ దేవి విమర్శలు

సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాణిరుద్రమ దేవి విమర్శించారు. సింగూర్ జలాలను ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు దక్కకుండా దోచుకుపోయిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. కరోనాను అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం చెందిందని, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను భ్రష్టు పట్టించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదే ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టి సామాన్యులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు,అభివృద్ధి పిలుపుతోనే అన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణం కోసమే యువ తెలంగాణ పార్టీ ఆవిర్భవించిందని ఆమె అన్నారు. పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితులై యువత ముందుకు వచ్చి పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని రాణిరుద్రమ దేవి చెప్పారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేసి తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న అరాచకాలపై పోరాటం చేస్తామని రాణిరుద్రమ దేవి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని హోసింగ్ బోర్డు కాలనీలో యువ తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని జిట్టా బాలకృష్ణ రెడ్డి, రాణి రుద్రమ దేవి ప్రారంభించారు.                                                         

Updated Date - 2020-08-13T22:03:44+05:30 IST