తెలంగాణ వడ్లను కేంద్రం కొంటుందా, లేదా?: కేసీఆర్

ABN , First Publish Date - 2021-11-09T00:17:19+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటను కేంద్ర కొంటుందా, లేదా సమాధానం

తెలంగాణ వడ్లను కేంద్రం కొంటుందా, లేదా?: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటను కేంద్ర కొంటుందా, లేదో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలను ఎప్పుడు విత్‌డ్రా చేసుకుంటారన్నారు. ధాన్యం ఎప్పుడు సేకరిస్తారో చెప్పాలన్నారు. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటుందా, లేదా తేల్చాలన్నారు.


మసిపూసి అడ్డగోలుగా మాట్లాడటం కాదన్నారు. సమాధానం చెప్పేవరకు బీజేపీని వదిలిపెట్టబోమని ఆయన తేల్చి చెప్పారు. దేశంలో ఎక్కడి ప్రజలైనా బాగుండాలని తాము కోరుకుంటామన్నారు. యాసంగిలో వడ్లు పండించాలని మీరు చెప్పలేదా అని కేంద్రాన్ని కేసీఆర్‌ నిలదీసారు. 62 లక్షల ఎకరాల్లో వరి ఉందంటే, లేదని వారు బుకాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆరు హెలికాప్టర్లు పెట్టి బీజేపీ నాయకులరకు వరి పంటని చూపిస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-09T00:17:19+05:30 IST