ప్రారంభమైన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ABN , First Publish Date - 2022-01-30T22:24:18+05:30 IST

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యఓతన

ప్రారంభమైన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈసందర్భంగా త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన అంశాలను సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేస్తున్నారు. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాల పై కూడా కేసీఆర్ ఎంపీలతో చర్చిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలనుకూడా చర్చిస్తున్నారు. 

Updated Date - 2022-01-30T22:24:18+05:30 IST