కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం

ABN , First Publish Date - 2020-05-29T16:58:59+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది. మర్కుక్‌ పంప్‌హౌస్‌లో మోటార్లను సీఎం కేసీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది. మర్కుక్‌ పంప్‌హౌస్‌లో మోటార్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. చినజీయర్‌స్వామితో కలిసి కేసీఆర్ మోటార్లను ప్రారంభించారు. మర్కుక్‌ పంప్‌హౌస్‌ నుంచి కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తి పోసే మోటర్లను ప్రారంభించారు. స్విచ్చాన్ చేసిన వెంటనే గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌లోకి చేరుకున్నాయి. అనంతరం కొండపోచమ్మ కట్టపై గోదావరి నీటికి సీఎం కేసీఆర్‌ జలహారతి ఇచ్చారు. 


కొండపోచమ్మ సాగర్‌లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఐదు జిల్లాల చిరకాల స్వప్నం సాకారం అయ్యింది. సముద్ర మట్టానికి 530 మీ. ఎత్తులో కొండపోచమ్మ రిజర్వాయర్‌ చేపట్టారు. రెండు పంప్‌హౌజ్‌లున్న ఏకైక రిజర్వాయర్‌ కొండపోచమ్మ రికార్డ్ సృష్టించనుంది. కొండపోచమ్మ రిజర్వాయర్‌ సామర్థ్యం 15 టీఎంసీలు. కొండపోచమ్మతో 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే హైదరాబాద్‌కు కూడా తాగునీరు అందనుంది.


అంతకముందు కొండపోచమ్మ ఆలయంలో వైభవంగా చండీయాగం నిర్వహించారు. చండీయాగం, పూర్ణాహుతికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. అనంతరం కొండపోచమ్మ అమ్మవారిని కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయంలో కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2020-05-29T16:58:59+05:30 IST