రేపు ఢిల్లీకి సీఎం KCR

ABN , First Publish Date - 2022-02-24T16:53:05+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు.

రేపు ఢిల్లీకి సీఎం KCR

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. కేసీఆర్‌తో పాటు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ వెళతారు. ఈరోజే సీఎం ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా... అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు అయ్యింది. థర్డ్ ఫ్రంట్‌లో భాగంగా ముఖ్యమంత్రి హస్తినకు వెళ్తున్నారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ వెంట పలువురు ఎంపీలు, మంత్రులు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. 


Updated Date - 2022-02-24T16:53:05+05:30 IST