హైదరాబాద్: జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్‌తో పాటు ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలుకోల్పోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ రంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.