అణగారిన వర్గాల కోసం జీవితాంతం పరితపించిన అంబేద్కర్: కేసీఆర్

ABN , First Publish Date - 2022-04-14T01:25:54+05:30 IST

అణగారిన వర్గాల సామాజిక, ఆర్ధిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.

అణగారిన వర్గాల కోసం జీవితాంతం పరితపించిన అంబేద్కర్: కేసీఆర్

హైదరాబాద్: అణగారిన వర్గాల సామాజిక, ఆర్ధిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. భారత రత్న, రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బడుగు, బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకుండదనే ఉద్దేశంతో వారికి ఖచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని సీఎం పేర్కొన్నారు. అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారత జాతి చేసుకున్న అద`ష్టమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా దేశ పురోగమనానికి పునాదులు వేసిన అంబేద్కర్ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. 


అంబేద్కర్ స్పూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వేల కోట్ల రూపాయలతో ఎన్నో కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నదని సీఎం తెలిపారు. దళిత సాధికారత కోసం, అంబేద్కర్ ఆయన సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకం ద్వరా అర్హులైన దళిత కుటుంబానికి 10లఓల రూపాయల భారీ మొత్తాన్ని నూటికి నూరుశాతం సబ్సిడీ కింద ఆర్ధిక సహాయం అందిస్తున్నదని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వెనుకబాటు తనాన్ని రూపుమాపేందుకు చదువే శక్తివంతమైన ఆయుధమని భఆవించిన ప్రభుత్వం అణగారిన వర్గాలకు చెందిన విద్యార్ధుల విద్య కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నదని సీఎం అన్నారు. అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటుచేసిన గురుకులాలు విజయవంతంగా నడుస్తున్నాయని సీఎం తెలిపారు. 

Updated Date - 2022-04-14T01:25:54+05:30 IST