పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తే లేదు: కేసీఆర్
ABN , First Publish Date - 2021-06-14T02:01:13+05:30 IST
పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తే లేదు: కేసీఆర్
హైదరాబాద్: ప్రగతి భవన్‌లో అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఆకస్మిక తనిఖీలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో మొక్కలు నాటడం పురోగతి తనిఖీలో భాగంగానే సాగుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇంతగా తాను సమావేశం నిర్వహించి వివరించినా.. తమ పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తే లేదన్నారు. తన ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరు చెప్పినా వినేదిలేదని అదనపు కలెక్టర్లు, డీపీవోలకు సీఎం హెచ్చరించారు. జూన్ 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో తనిఖీ నిర్వహిస్తామన్నారు. అలాగే జూన్ 21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీ లు నిర్వహిస్తామన్నారు.